us president Salary’s : అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతంటే?
us president Salary's : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రెసిడెంట్ జీతం ఎంతనే చర్చ మొదలైంది. వార్షిక వేతనం 400,000 డాలర్లు(F3.36 కోట్లు) ఉంటుంది.

us president Salary’s : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రెసిడెంట్ జీతం ఎంతనే చర్చ మొదలైంది. వార్షిక వేతనం 400,000 డాలర్లు(F3.36 కోట్లు) ఉంటుంది. వీటితో పాటు అధికారిక విధుల నిర్వహణ కోసం ఏడాదికి మరో 50,000(F42 లక్షలు) డాలర్లు ఇస్తారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, వైట్ హౌస్ నిర్వహణ వంటి ఖర్చుల కోసం 1,00,000(84 లక్షలు) డాలర్లు, 19000 డాలర్లు ఆతిథ్యం, ఈవెంట్ల ఇస్తారు.
2001లో చివరిగా జీతాలు పెంచారు. అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ఏడాదికి కేవలం 2,000 డాలర్లు జీతంగా పొందారు. అయితే 18వ శతాబ్దంలో ఈ జీతం ఎక్కువ విలువైనదిగానే పరిగణిస్తారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ సంపదలో వృద్ధి, అధ్యక్షుల ఖర్చులు పెరిగిపోవడంతో జీతం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ పదవీ విరమణ చేసిన తర్వాత వారికి వార్షిక పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం అది 240 వేల డాలర్ల కన్నా( సుమారు రూ. 2 కోట్లు ) కన్నా ఎక్కువగా ఉంది. ప్రెసిడెంట్కు ఈ పెన్షన్ జీవితకాలం లభిస్తుంది.
ఎప్పుడు ఎంత జీతం?
1789లో 25,000 డాలర్లు
1873లో 50,000 డాలర్లు
1909లో 75,000 డాలర్లు
1949లో 100,000 డాలర్లు
1969లో 200,000 డాలర్లు
2001లో 400,000 డాలర్లు.