IRCTC బంపరాఫర్..తక్కువ ధరలో సింగపూర్,మలేషియా టూర్ ప్యాకేజి
తక్కువ ధరతో విదేశాలను సందర్శించే అవకాశం కూడా కల్పిస్తోన్న ఐఆర్ సీటీసీ..తాజాగా మరో అదిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)తక్కువ ధరకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇందులో విహారయాత్రల నుండి మతపరమైన ప్రదేశాల వరకు అన్నీ ఉంటాయి. తక్కువ ధరతో విదేశాలను సందర్శించే అవకాశం కూడా కల్పిస్తోన్న ఐఆర్ సీటీసీ..తాజాగా మరో అదిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సింగపూర్, మలేసియా దేశాలను తక్కువ ఖర్చుతో చుట్టేసి రావాలనుకుంటున్న వారి కోసం మ్యాజికల్ మలేసియా విత్ సింగపూర్ సెన్సేషన్(Magical Malaysia With Singapore Sensation) పేరుతో
ఐఆర్ సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది.
ఈ టూర్ ప్యాకేజీ అక్టోబర్ 28న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ప్యాకేజీలో భాగంగా సింగపూర్,మలేషియాలోని ఫేమస్ ప్లేస్ లను సందర్శించవచ్చు.
ఇక ధర విషయానికొస్తే సింగిల్ షేరింగ్‌కు రూ. 1,56,030, డబుల్ షేరింగ్‌కు రూ. 1,29,280, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 1,28,720 చెల్లించాలి. 5–11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ. 1,11,860… 2–11 సంవత్సరాల చిన్నారులకు విత్ అవుట్ బెడ్ అయితే రూ. 98.820 చెల్లించాలి. ఫుడ్,ఫ్లైట్ టిక్కెట్స్,హోటల్ రూమ్స్,ట్రావెల్ ఇన్సూరెన్స్ మొత్తం ఈ ప్యాకేజీలోనే ఉంటుంది.వీటి కోసం ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు వసూలు చెయ్యరు. ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్ సెట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.



