RC 16 నుంచి రెహమాన్ ఔట్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనాతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనాతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రూరల్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమా గురించి తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేంటంటే ఈ ప్రాజెక్టు నుంచి ఏఆర్ రహమాన్ ను తప్పించారని, ఆ స్థానంలో దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ రెస్పాండ్ అయ్యారు. RC 16 గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఏదైనా అప్డేట్ ఉంటే మా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుండి ఇస్తాము. దయచేసి ఎలాంటి రూమర్స్ ని నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.



