నాచారం డీపీఎస్ లో యోగా డే వేడుకలు..
 
                                
పల్లవి, హైదరాబాద్: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. 8 వేల మందికిపైగా స్టూడెంట్లు యోగాసనాలు వేశారు. స్టూడెంట్ల నుంచి వచ్చిన ‘ఓం’ శబ్ధం క్యాంపస్ గ్రౌండ్ లో ప్రతిధ్వనించింది. బీజేపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, విద్యాసంస్థల చైర్మన్ మల్క కొమురయ్య, స్వామి బోధమయానంద ముఖ్య అతిథులుగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. విద్యాసంస్థల సీఈవో యశస్వి మాట్లాడుతూ ..ఎంతో బిజీగా ఉండే ప్రధాని మోదీ 30 నిమిషాల పాటు యోగాకు టైమ్ కేటాయిస్తున్నారని.. ఆయనను మనందరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం స్టూడెంట్లకు వ్యాసరచన, క్విజ్, యోగాసనాల పోటీలు నిర్వహించారు.




 
          



