బీఆర్ఎస్కు బిగ్ షాక్.. 15 రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చేయండి : హైకోర్టు
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్గొండలోని ఆ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది.

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్గొండలోని ఆ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా లక్ష రూపాయల నష్ట పరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పార్టీ ఆఫీసును రెగ్యూలర్ చేసేలా అనుమతి ఇవ్వాలని హైకోర్టులో బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను సైతం హైకోర్టు కొట్టివేసింది. అంతకుముందు ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో పార్టీ ఆఫీసును కట్టారంటూ కాంగ్రెస్ అరోపించింది. వెంటనే పార్టీ ఆఫీసును కూల్చేయాలంటూ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.
ఈ క్రమంలో దాన్ని కూల్చొద్దంటూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. బీఆర్ఎస్ ఆఫీసు రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖను ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. అక్కడ ఆఫీస్ కట్టకముందే అనుమతి తీసుకోవాలి కదా. ఆఫీసు కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. ఇది చట్ట ఉల్లంఘనే అవుతుందని పిటిషన్ ను కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.