నాచారం డీపీఎస్ లో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ అండ్ హైబ్రిడ్ లెర్నింగ్
 
                                
పల్లవి, హైదరాబాద్: జూన్15న కార్టే బ్లాంచే అనే సీబీఎస్సీ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా 48 పాఠశాలల్లో అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ గా నాచారంలోని డీపీఎస్ స్కూల్ ఎంపికైంది. విద్యాసంస్థల చైర్మన్ మల్క కొమురయ్య.. నాచారం డీపీఎస్ లో ఈ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ అండ్ హైబ్రిడ్ లెర్నింగ్ ను ప్రారంభించారు. విద్యాసంస్థల సీఈవో యశస్వి, సీనియర్ ప్రిన్సిపాల్ సునీతారావు, డీజీఎం సరిత, వైస్ ప్రిన్సిపాల్స్ గౌరీ వెంకటేశ్, సుధ, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సుభాష్, స్టూడెంట్లు, టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యారంగంలో కొత్త అభ్యాస పద్దతులకు అనుగుణంగా బోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఈవో యశస్వి మాట్లాడుతూ.. మరింత మెరుగైన బోధన కోసం హైబ్రిడ్ లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.




 
          



