శకుని పాచికల సీక్రెట్ ఏంటో తెలుసా!
మహాభారతంలోని శకుని పాత్ర గురించి మనం జీవితంలో ఏదో ఒక సందర్భంలో విని ఉంటాం
మహాభారతంలోని శకుని పాత్ర గురించి మనం జీవితంలో ఏదో ఒక సందర్భంలో విని ఉంటాం. శకుని మామ జూదం ఆడడంలో నిష్ణాతుడు. అతను ఎక్కడ జూదం ఆడినా అతనిదే గెలుపు. శకుని పాచికలు వేస్తే తిరుగండదని..ఆయన కోరుకున్న నెంబర్ పడేదని ఇలా ఆయన గురించి విని ఉంటాం. ఇలా చేసే కౌరవుల చేతిలో పాండవులు ఓడిపోయేలా చేశాడు. అయితే శకుని మనసులో కోరుకున్నట్లే బయట ఆయన పాచికల నెంబర్ ఉండేది. తన ఆ టాలెంట్ తోనే కురువంశాన్ని నాశనం చేశాడు. కాబట్టి శకుని పాచికల సీక్రెట్ ఏంటీ..అతడు కోరుకున్న నెంబరే ఎలా పడేది అనేది ఇప్పుడు చూద్దాం.
శకుని జన్మించింది గాంధార రాజ్యంలో. ఇదే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కాంధహార్. శకుని తండ్రి సుభల. ఇతనికి వందమంది కుమారులు. ఒక కుమార్తె. శకుని చిట్టచివరి వాడు కావడం చేత చురుకుగా, చలాకీగా ఉండడంతోపాటు పెద్దయిన తర్వాత శస్త్ర విద్యలో, జూదంలో మంచి నేర్పు కూడా పొందగలిగాడు. శుకుని తండ్రి చనిపోయే స్థితికి చేరుకున్నప్పుడు, శకునిని పిలిచి.. నీవు నేను చనిపోయిన తర్వాత..నా ఎముకలలోనే పగ అంతా ఉంటుంది కాబట్టి ఎముకలను తీసి పాచికలు తయారు చేసి.. నీవు మనసులో ఏమి అనుకొని వేస్తే అదే జరుగుతుంది అని చెబుతాడు. నీకు జూదం లో మంచి పట్టు ఉంది కాబట్టి జూదం ఆడి కౌరవుల సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని ప్రమాణం చేయించుకుంటాడు సుభల. పాచికలు వేసే ప్రతీసారీ తన శక్తి దానిలో ఉంటుందని తెలిపాడు.
ఇక అందరూ చనిపోయారు.. కేవలం శకుని మాత్రమే ఉన్నారు.. అతనిని కారాగారం నుంచి విడిపించమని గాంధారి ధృతరాష్ట్రుని కోరగా, శకునిని విడిపిస్తారు. కారాగారం నుంచి విడుదలైన శకుని ధుర్యోధనుడి పక్కన చేరి కౌరవుల నాశనానికి ఫ్లాన్ వేస్తాడు. చివరికి న ప్రాణాళి ప్రకారం తన పాచికల ప్రయోగంతో కౌరవవంశాన్ని నాశనం అయ్యేలా స్కెచ్ వేసి విజయం సాధిస్తాడు.



