ఎయిర్ ఏసియా బంపరాఫర్..చాలా తక్కువ ధరకే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్
భారత ప్రయాణికులు థాయ్‌ల్యాండ్ వెళ్లేందుకు వీసా అవసరం లేదు. కేవలం పాస్‌పోర్టు ఉంటే చాలు.
ఎయిర్ ఏసియా(airasia)బంపరాఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి కేవలం రూ.7,390కే టిక్కెట్ ను..చెన్నై నుంచి ఫుకెట్‌కు రూ.6,990కే టిక్కెట్ ను అందించనున్నట్లు ఎయిర్ ఏసియా తెలిపింది. అక్టోబరు 27 నుంచి హైదరాబాద్-బ్యాంకాక్ సర్వీస్(వారానికి 4 ఫ్లైట్ లు) ,అక్టోబరు 30 నుంచి చెన్నై-ఫుకెట్ సర్వీసును(వారానికి 3 ఫ్లైట్స్) ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద ఈ నెల 22 వరకు రాయితీ టికెట్లు ఎయిరేషియా.కామ్, ఎయిరేషియా మూవ్ యాప్‌పై విక్రయించనున్నట్లు థాయి ఎయిర్ ఏసియా కమర్షియల్ హెడ్ తన్సిత తెలిపారు.
హైదరాబాద్ – బ్యాంకాక్ మధ్య 2024 అక్టోబరు 27 నుంచి 2025 మార్చి 29 వరకు, చెన్నై – ఫుకెట్ మధ్య 2024 అక్టోబరు 30వ తేదీ నుంచి 2025 మార్చి 29 మధ్య ప్రయాణానికి వీటిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. భారత ప్రయాణికులు థాయ్‌ల్యాండ్ వెళ్లేందుకు వీసా అవసరం లేదు. కేవలం పాస్‌పోర్టు ఉంటే చాలు.



