టీచర్ల సమస్యలు పరిష్కరించండి: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

- డిప్యూటీ సీఎం భట్టిని కలిసి విజ్ఞప్తి
పల్లవి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్, బకాయి బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎంతో కాలంగా మెడికల్, సరెండర్ పెండింగ్ బిల్స్ రాక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను కూడా వెంటనే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గత పరుస్తూ, ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మెరుగైన ఫిట్ మెంటట్ తో పీఆర్సీ అమలు చేయాలని, గత సంవత్సరం సిపిక్స్ సర్వే విజయవంతంగా నిర్వహించిన ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు తక్షణం రెమ్యూనరేషన్ అందించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై సమస్యలపై ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు.