ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఉత్సాహభరితంగా కొనసాగుతోన్న ఫెరియా-వై-ఫియస్టా 2.0 ప్రోగ్రామ్
 
                                
హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఫెరియా-వై-ఫియస్టా 2.0 ప్రోగ్రామ్ ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. జంట నగరాల్లోని 50 కి పైగా పాఠశాలల నుండి 4500 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కొమరయ్య,సీఈవో& డైరక్టర్ యశస్వి, డైరక్టర్ పల్లవి,డైరెక్టర్ త్రిభువన, ఆర్ అండ్ ఆర్ సీనియర్ ప్రిన్సిపాల్ అండ్ డైరక్టర్ సునీతరావు, జూనియర్ ప్రిన్సిపాల్ శాంతి థోని,తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈవెంట్లు ఐఐఎఫ్ బీఎం, ఎపిస్టెమియా, యూత్ పార్లమెంట్ ఈవెంట్ల లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లలో పాల్గొని ప్రతిభ కనబరిచినవారికిరివార్డులను అందజేశారు. యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఫెరియా-వై-ఫియస్టా సిరీస్ లో భాగంగా జరిగిన IIFBM..క్షేత్రస్థాయి ఆలోచనలతో భావసారూప్యత కలిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరినీ ఏకతాటిపైకి తెస్తుంది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ వెంచర్-సమ్ మేనరిజం, రిస్క్ తీసుకునే బిహేవియర్,సమర్థవంతమైన భావజాలాలను అన్వేషించే అవకాశం ఇవ్వబడింది. ఈ మేధోమథన కార్యక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 550 మంది పాల్గొన్నారు. ఫ్యూచరిస్టిక్ క్రైసిస్, హిస్టారికల్ క్రైసిస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, లీగల్ రైట్స్, కార్పొరేట్ లీగల్ కమిటీ, ఈ-కామర్స్, హ్యూమన్ రిసోర్స్, ప్రొడక్షన్ హౌస్, న్యూ ఎనర్జీ సస్టెయినబిలిటీ, టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ వంటి వివిధ కమిటీలుగా ప్రతినిధులను విభజించారు.ఈ కార్యక్రమానికి యశోద హాస్పిటల్స్ బోర్డు సభ్యురాలు శ్రీమతి మేఘనా జూపల్లి, స్టూడెంట్ ట్రైబ్ సీఈఓ శ్రీ చరణ్ లక్కరాజు అధ్యక్షత వహించారు.యశస్వి మల్కాతో కలిసి జరిగిన ప్యానెల్ డిస్కషన్ లో ఈ విశిష్ట అతిథులు గిగ్ ఎకానమీలో ఎలా నావిగేట్ చేయాలనేదానిపై, అదేవిధంగా ,మరెన్నో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దృష్టి సారించే కీలక రంగాలను ఉద్దేశించి ప్రసంగించారు.
మరొక ఉత్తేజకరమైన కార్యక్రమం యూత్ పార్లమెంట్..ఇందులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటుగా జంట నగరాల నుండి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని ఒక చర్చకు నాయకత్వం వహించడంలో,పార్లమెంటరీ చర్చలో తమ అభిప్రాయాలను తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లిమిటెడ్ మాజీ చైర్మన్ క్రిశాంక్ మన్నె.. పార్లమెంటరీ వ్యవస్థ పనితీరులో యువతకు అవగాహన కల్పించడానికి, నిమగ్నం చేయడానికి రూపొందించిన యూత్ పార్లమెంట్ ‘వికసిత్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్ని మాట్లాడారు. తన ప్రసంగంలో దేశాభివృద్ధిపై విద్యార్థుల ఆలోచనలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై వారి చర్చా నైపుణ్యాలను కొనియాడారు. భారతదేశాన్ని సంపన్న, అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువత శక్తి, సృజనాత్మకత, అభిరుచి అవసరమని డిపిఎస్ నాచారం గట్టిగా నమ్ముతోంది.
మొత్తంగా రెండు రోజుల పాటు జరిగిన పార్లమెంట్, సైన్స్ అండ్ బిజినెస్ సమావేశాలు ప్రతినిధులను నిర్మాణాత్మకంగా నిమగ్నం చేసి, వారి చిత్తశుద్ధితో భాగస్వామ్యం, ఆలోచనల్లో స్పష్టత, తమ రంగాల్లో ఔన్నత్యానికి అవార్డులు, ప్రత్యేక ప్రస్తావనలతో విజయవంతంగా ముగిశాయి.
ఫెరియా-వై-ఫియస్టా రెండవ రోజు స్పోర్ట్స్ ఈవెంట్లు మైదానంలో ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు, ఆశ్చర్యకరమైన విజయాలతో అద్భుతమైన క్రీడాస్ఫూర్తిని హైలైట్ చేశాయి. వివిధ క్రీడా విభాగాల్లో విజేతలకు డీపీఎస్ చైర్మన్ ఎం.కొమరయ్య అవార్డులను ప్రదానం చేయడంతో కార్యక్రమం ముగిసింది.
.

 
          



