టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ వీడే!
టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ వీడే!

పల్లవి, వెబ్ డెస్క్: పహల్గాం టెర్రర్ ఎటాక్ జరిగిన తీరు 2000, 2002లో జరిగిన దాడులతో పోలి ఉంది. ఆ దాడులు కూడా ప్రముఖుల భారత పర్యటనల సమయంలో జరిగాయి. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పర్యటనకు ముందు చిట్టిసింగ్పురాలో 36 మంది సిక్కులను టెర్రరిస్టులు చంపారు.
2002లో అమెరికా సహాయ కార్యదర్శి క్రిస్టినా రోకా పర్యటన సమయంలో కలుచక్లో 23 మందిని చంపారు. ఈసారి కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భారతదేశంలో ఉన్న సమయంలో మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్.. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారిగా లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరిగా ఆర్మీ ఇంటెలీజెన్స్ గుర్తించింది. వీడు భారతదేశంలో జరిగిన అనేక పెద్ద ఉగ్రవాద దాడుల్లో ఉన్నాడు. ఎప్పుడూ లగ్జరీ కార్లలో ప్రయాణించే వీడిని రక్షించేందుకు.. లష్కరే ఉగ్రవాదులు ఎల్లప్పుడూ అత్యాధునిక ఆయుధాలతో బందోబస్తు నిర్వహిస్తుంటారు.
సైఫుల్లా ఖలీద్ అనేటోడు మోస్ట్ డేంజరస్.. టెర్రరిస్ట్. పాక్ ఆర్మీ మోటివేటర్. అందుకే ఆర్మీ ఆఫీసర్లకు కూడా వీడంటే ఇష్టం. వీడు ఇస్లామాబాద్‌లోని లష్కరే తోయిబా స్థావరం నుంచి పనిచేస్తాడు. పహల్గాం టెర్రర్ ఎటాక్ కోసం కాశ్మీరీ ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్ సాయం తీసుకున్నట్లు, బైసరన్ ప్రాంతంలో ముందస్తు రెక్కీ నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పహిల్గాం ఎటాక్ కు రెండు నెలల ముందు.. సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కంగన్పూర్కు చేరుకున్నాడు, అక్కడ పాకిస్తాన్ సైన్యం పెద్ద బెటాలియన్ ఉంది. పాకిస్తాన్ సైన్యంలోని కల్నల్ జాహిద్ జరీన్ ఖట్టక్ వీడిని జిహాదీ ప్రసంగం చేయడానికి అక్కడికి పిలిచాడు. అక్కడ అతను పాకిస్తాన్ సైన్యాన్ని భారతదేశంపైకి రెచ్చగొట్టాడు. పాక్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన సమావేశంలో.. వీడు మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ఫిబ్రవరి 2, 2025 అని నేను హామీ ఇస్తున్నాను. 2026 ఫిబ్రవరి 2 నాటికి కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాము. రాబోయే రోజుల్లో, మా ముజాహిదీన్లు దాడులను తీవ్రతరం చేస్తారు. 2026 ఫిబ్రవరి 2 నాటికి కాశ్మీర్ విముక్తి పొందుతుందని మేము ఆశిస్తున్నాము” అని అన్నాడు. ఈ మీటింగ్ ను ఐఎస్ఐ, పాక్ సైన్యం సంయుక్తంగా నిర్వహించాయి.
గత సంవత్సరం అబోటాబాద్ అడవులలో లష్కరే తోయిబా పొలిటికల్ వింగ్ ఓ టెర్రర్ రిక్రూట్ మెంట్ క్యాంప్ నిర్వహించింది. సైఫుల్లా కసూరి దానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఉగ్రవాద దాడుల కోసం అబ్బాయిలను ఎంపిక చేశాడు. టార్గెట్ కిల్లింగ్స్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చాడు. భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న అబ్బాయిలను రెచ్చగొట్టాడు. ఆ అబ్బాయిలకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన తర్వాత, వారు పాకిస్తాన్ సైన్యం సాయంతో బార్డర్ దాటించారు.