మోడీ చొరవ.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇండియాకు
మోడీ చొరవ.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇండియాకు

న్యూఢిల్లీ: 2008 ముంబై ఉగ్రవాద దాడుల కీలక నిందితుడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహవ్వూర్ రాణాను కేంద్ర ప్రభుత్వం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకువస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున టెర్రరిస్ట్ డియాలో అడుగు పెట్టే అవకాశం ఉంది. ముంబయి బాంబు పేలుళ్లలో కీలక సూత్రధారిగా ఉన్న తహవ్వూర్ రాణా.. విదేశాలకు పారిపోయాడు. కాగా అమెరికాలో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కాగా తాను అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని, భారతదేశానికి తన అప్పగింతను నిలిపివేయాలని కోరుతూ రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతని అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మొన్న ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి, తహవూర్ రాణాను అప్పగించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎట్టకేలకు అతడిని భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది.
కాగా 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడులకు కీలక కుట్రదారులలో ఒకరైన పాకిస్తానీ-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా సహచరుడు. ఇతనికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి.