Radhika Apte: గుడ్ న్యూస్ చెప్పిన రాధికా ఆప్టే
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రాధికా ఆప్టే. ఈ సినిమాలో తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రాధికా ఆప్టే. ఈ సినిమాలో తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత సైతం తెలుగులో ధోనీ, లెజెండ్, లయన్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ గా ఎదిగింది. అనంతరం అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె పాపులర్ బ్రిటీష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టాయ్లర్ను పెళ్లి చేసుకుంది.
అయితే.. తాజాగా ఆమె తల్లికాబోతున్నట్లు తెలిపింది. బేబీ బంప్ తో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఎఫ్ఐ లండన్ ఫిలిం ఫెస్టివల్ 2024కు హాజరైన ఈ బ్యూటీ బేబి బంప్‌తో దర్శనమిచ్చింది. దాంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రాధికా ఆప్టేకి 2012 \లో వివాహం జరిగింది. దాదాపు 12 సంవత్సరాల తరువాత ఆమె తల్లి కాబోతోంది.



