బాచుపల్లి లోని పల్లవి మోడల్ స్కూల్ లో యోగా డే
జూన్ 21 అంతర్జాతీయ యోగ డే ను పురస్కరించుకొని బాచుపల్లి లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వారు యోగడేను నిర్వర్తించటం జరిగింది .యోగ మానవుని దైనందిక జీవితంలో చాలా ముఖ్యమైనది కాబట్టి ‘ఆరోగ్యమే మహాభాగ్యం ‘ అని పెద్దలన్నారు .అటువంటి ఆరోగ్యాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచాలంటే యోగ చాలా అవసరం. యోగ చేయటం వలన మానసిక ఒత్తిడి తట్టుకునే శక్తి ఉంటుంది. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తుంది. కోపాన్ని నియంత్రించుకునే శక్తి, ఆలోచన దృక్పథం పెంపొందుతాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిపురస్కరించుకుని మన ప్రధాని నరేంద్ర మోడి గారి పిలుపుతో అంతర్జాతీయ దేశాల సైతం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. బాచుపల్లి లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వారు ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. గౌరవనీయురాలైన ప్రిన్సిపల్ శ్రీమతి అనురాధ మూర్తి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదట రామ రామ అనే క్లాసికల్ పాటతో ప్రారంభించి శ్లోకాలు కూడా చెప్పడం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ సూర్య నమస్కారములు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సూర్య నమస్కారాలు చేయటంలో పాల్గొని విచ్చేసిన అతిధులను ఆకట్టుకోవడం జరిగింది. యోగ పితామహుడైన రిషి పతంజలి ఆశీర్వాదాలనుస్మరించుకుంటూ ‘యోగేన చిత్తస్య పదేన వాచం ‘ అని యోగాసనాలు యొక్క ప్రాముఖ్యతను గురించి గౌరవనీయురాలైన ప్రిన్సిపల్ శ్రీమతి అనురాధ మూర్తిగారు విద్యార్థులతో యోగాసనాలు ద్వారా శ్వాస మీద ధ్యాస మరియు ఇంద్రియనిగ్రహ శక్తి అలబడుతుందని మందులకు సైతం నయం కాని ఎన్నో వ్యాధులు యోగాసన సాధన ద్వారా నియంత్రించవచ్చునని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుండి యోగాసనాలపై అవగాహన కల్పిస్తే రాబోయే తరంలో వారు ఎటువంటి సమస్యనైనా నియంత్రించుకునే శక్తిని పొందగలరని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంస్థ డైరెక్టర్ గౌరవనీయులైన సుశీల్ గారు చెప్పడం జరిగింది. యోగ యోగాసనాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పల్లవి సంస్థవిద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







