12 వేలకే ఏఐ 5G స్మార్ట్ ఫోన్
12 వేలకే ఏఐ 5G స్మార్ట్ ఫోన్

పల్లవి, వెబ్ డెస్క్: తక్కువ ధరకే మార్కెట్ లోకి సూపర్స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మార్చి 27న విడుదలైంది. ఇన్ఫినిక్స్ కంపెనీ తన కొత్త నోట్ 50X 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gకి కొనసాగింపుగా లాంచ్చేసింది. తక్కువ ధరకే ఈ మోడల్ ఫోన్లో బోలెడన్ని ఫీచర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్, తక్కువ ధరలో 5G ఫీచర్‌ను అందిస్తోంది. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ₹12,000గా ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్సెట్ వాడారు. ఇది 90fpsలో గేమింగ్ ఎక్స్ పీరియన్స్, మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 5,500mAh “సాలిడ్ కోర్” బ్యాటరీ, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. XOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్లో చాలా AI ఫీచర్లు ఉన్నాయి. AIGC పొర్ట్రెయిట్ మోడ్, AI వాల్‌పేపర్ జనరేటర్, AI నోట్, AI Eraser, AI Cut out, రైటింగ్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, కాల్ అసిస్టెంట్, సోషల్ అసిస్టెంట్, సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్లున్నాయి. కెమెరా క్వాలిటీ పరంగా చూస్తే.. ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. వెనుక వైపు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్‌తోపాటు యాక్టివ్ హాలో లైటింగ్‌ను పొందవచ్చు.