నాచారం డీపీఎస్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం
 
                                
పల్లవి, హైదరాబాద్: నాచారంలోని డీపీఎస్ లో శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో 5,6వ తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ రకాల బ్లడ్ గ్రూపులతో పాటు రక్తదానం ప్రాముఖ్యతను వారు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ–2024 థీమ్ ను హైలెట్ చేస్తూ ప్లకార్డులు, డ్రాయింగ్స్, కొటేషన్లతో అవగాహన కల్పించారు.



 
          



