నాదర్గుల్ డీపీఎస్ లో స్వాగతోత్సవం

పల్లవి, హైదరాబాద్: నాదర్గుల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో స్వాగతోత్సవం నిర్వహించారు. స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2 కోసం టీచర్ల బృందం సర్ప్రైజ్ లను ప్లాన్ చేసింది. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు అద్భుత విజయాలు సాధించాలని స్కూల్ యాజమాన్యం స్వాగతం పలికింది. టీచర్లతో కలిసి విద్యార్థులంతా కాన్వాస్ పై మొదటి రోజు చేతిముద్రలతో అలరించారు. ‘‘మళ్లీ పాఠశాలకు రావడం నాకు ఎంతో ఇష్టం’ అనే ప్రాంప్ట్‌తో బ్యాగ్‌లను అలంకరించే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్ వినూత్నమైన కార్యక్రమాలతో కొత్త విద్యా సంవత్సరాన్ని ఆహ్వానించింది. ఈ సందర్భంగా డీపీఎస్ నాదర్గుల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థులంతా ఈ అకడమిక్ ఇయర్ లో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని వాటి కోసం శ్రమించాలని సూచించారు.

