బడుల యూడైస్ వివరాల పరిశీలన
బడుల యూడైస్ వివరాల పరిశీలన
పల్లవి, జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలకు సంబంధించిన యూ డైస్ సమాచారాన్ని థర్డ్ పార్టీకి చెందిన డి.ఎడ్ విద్యార్థుల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఎండపల్లి మండలంలోని పాఠశాలలో సర్వే నిర్వహించారు. అయా పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు యూడైస్ ప్లస్(డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ పోర్టల్)లో బడులకు సంబంధించిన వివరాలు నమోదు చేశారు. ఈ సమాచారంపై విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సర్వే ప్రారంభించారు. ఈ నెల 22 వరకు ప్రక్రియ కొనసాగనుంది. జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీ పోస్టుల వివరాలు, మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది వంటి వివ రాలను యూడైస్ ప్లస్‌లో పొందుపరిచారు. ప్రభుత్వ బడుల్లో డైట్ విద్యార్థులు సర్వే చేపట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారులు బోనగిరి ప్రభాకర్, రామచంద్రం ల పర్యవేక్షణలో వెల్గటూరు మండలంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్, ఎండపల్లీ మండలంలోని ఎండపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి వివరాలు సరిగా ఉన్నాయా లేదా పరిశీలించారు. ‘యూ డైస్ ప్లస్‌లో పొందుపరిచిన వాటికి, ప్రస్తుత పరిస్థితు లకు మధ్య ఉన్న తేడా గుర్తించనున్నారు. సర్వేతో పారదర్శకత పెరుగుతుందనీ మండల విద్యాధికారులు పేర్కొన్నారు. వెలగటూరు మండలంలోని వెల్గటూర్, చెగ్యాం, ముక్కట్రావుపేట, పైడిపల్లి ప్రాథమిక పాఠశాలలు, వెలగటూర్, చెగ్యాం ఉన్నత పాఠశాలలు, కప్పారావుపేట, కిషన్ రావు పేట ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. కాగా ఎండపల్లి మండలంలోని రాజారాం పల్లి, కోడిపుంజులపల్లి, కొత్తపేట, పడకల్, గుల్లకోట ప్రాథమిక పాఠశాలలు, అంబారిపేటలోని ప్రాథమికోన్నత పాఠశాల, కొత్తపేట గుల్లకోటలోని ఉన్నత పాఠశాలలో ఈ సర్వే నిర్వహించనున్నారు. కార్యక్రమాల్లో సర్వే బృందం సభ్యులు ఎస్ మనీషా, ఓం సాగర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు వైద్య వెంకటేశ్వర్లు, రాజరాణి, రజని, పాల్గొన్నారు.



