ఖాళీ కడుపుతో పాలు తాగవచ్చా.. చాలా మంది చేస్తున్న తప్పు ఇదే!

పాలు మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది. పాలలో పోషకాలు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి కండరాలను బలపరచడంలో సహాయపడతాయి. పాలను కొంతమంది ఉదయం పూట తాగితే మరికొందరు రాత్రి పడుకునే ముందు తాగుతారు. కానీ, పాల గురించి అందరికీ ఒక సాధారణ ప్రశ్న ఉంటుంది. అదేంటంటే.. ఖాళీ కడుపుతో పాలు తాగవచ్చా లేదా? అలా తాగితే ఏమవుతుంది? అని. కాబట్టి.. ఇప్పుడు మనం ఖాళీ కడుపుతో పాలు తాగొచ్చా? పాలు తాగడానికి సరైన సమయం ఏంటి? అనేది తెలుసుకుందాం.
- పాలు ఎప్పుడు తాగాలి?
పాలలోని విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అది మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. పగలు, రాత్రి.. ఇలా ఏ సమయంలో పాలు తాగాలి అనేది వ్యక్తిగత విషయం. కాకపోతే.. ఆ ఆ విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నవారు ఇది తెలుసుకోవాలి.
- ఉందయం పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.
ఉదయాన్నే పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే కండరాలు కూడా బలపడతాయి. కాబట్టి ఉదయాన్నే పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.
- ఉందయం పాలు తాగడం వల్ల కలిగే నష్టాలు.
లాక్టోస్ అసహనం ఉన్నవారు ఉదయం పాలు తాగడం వల్ల కడుపులో నొప్పి, విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
- ఖాళీ కడుపుతో పాలు తాగవచ్చా?
ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఖాళీ కడుపుతో పాలు తాగే అలవాటు ఉంటే.. గోరువెచ్చని పాలకి బదులుగా చల్లని పాలు తాగడం మంచిది.
- పాలు ఏ సమయంలో తాగితే మంచిది?
కేవలం అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే పాలు త్రాగాలి. అదేవిధంగా.. తక్కువ కొవ్వు ఉన్న పాలను తాగండి. ఇది శరీరంలో కొవ్వు పెరగడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, గుండె సమస్యలు ఉన్నవారు కాళీ కడుపుతో పాలు తాగకూడదు. ఇక రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే.. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.