నాచారం డీపీఎస్ లో సఫల్ శిక్షణా కార్యక్రమం
 
                                
పల్లవి, హైదరాబాద్: స్టూడెంట్లలో అనలైజింగ్ లెర్నింగ్ ను మెరుగుపరిచేందుకు 325 సీబీఎస్ స్కూళ్లకు నాచారం డీపీఎస్ లో సఫల్( స్ట్రక్చర్డ్ అసెస్ మెంట్ ఫర్ అనలైజింగ్ లెర్నింగ్) శిక్షణా కార్యక్రమాన్ని సీబీఎస్సీ నిర్వహించింది. ఈ నెల 7న జరిగిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని సీబీఎస్సీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ శ్వేతా సింగ్, నాచారం డీపీఎస్ ప్రిన్సిపాల్ సునీతారావుప్రారంభించారు. శిక్షణకు హాజరైన 266 మంది ఐటీ నోడల్ అధికారులకు సఫల్ లక్ష్యాలు, వాటి అమలు, ఉద్దేశాన్ని వివరించారు. స్టూడెంట్లలో అనలైజింగ్ లెర్నింగ్ ను అంచనా వేసేందుకు టీచర్లను సన్నద్ధం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్, నాదర్ గుల్, మహేంద్ర హిల్స్ లోని డీపీఎస్ స్కూళ్లకు చెందిన ఫ్యాకల్టీ పాల్గొన్నారు.


 
          



