కోటీశ్వరుడిని చేసిన పాత పాస్‌బుక్
కోటీశ్వరుడిని చేసిన పాత పాస్‌బుక్

పల్లవి, వెబ్‌డెస్క్: బాటపంటి నడుచుకుంట పోతే.. ఓ కోటి రూపాలు దొరికితే ఎట్ల ఉంటది? రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని అయితే ఎట్లు ఉంటది? ఉన్న పళంగా పూరి గుడిసే.. విల్లాగా మారితే ఎంత మంచిగుంటదో కదా! ఆ.. ఇవన్ని కలలోనే కనిపిస్తయి.. నిజంగా జరగవని మనకు తెలుసు. కానీ ఓ కాడ కల నిజమైంది ఉల్లా.. అది ఏన్నో కాదు.. చిలీ అనే దేశంల.
చిలీ దేశంలో ఉండే ఎక్సిక్వియల్ హినోజోసా వ్యక్తి నక్క తోక తొక్కిండు. పైసలు లేక.. సంసారం ఎల్లదీసేందుకు బాధపడ్డ ఆయన.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైండు. అట్లని ఏదో లాటరీ టికెట్ఏం తలగలేదు. 60 ఏండ్ల కింద తన తండ్రి బ్యాంక్ పాస్బుక్అతడి దరిద్రాన్ని తరిమి కొట్టింది. ఏం పొద్దు పోక.. ఇంట్ల అది ఇది ఎంకులాడుతుంటే.. ఎప్పుడో 60 ఏండ్ల కింద తన తండ్రి సంత్కల దాశిపెట్టిన బ్యాంక్‌పాస్‌బుక్ ఒక్కటి దొరికింది. అండ్ల ఎన్ని పైసలు ఉన్నయో చూద్దామని ఆ బ్యాంక్కాడికి పోయిన హినోజోసాకు పెద్ద షాక్తగిలింది. దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డు తగిలినట్లు.. ఎన్కటి పాసుబుక్ దొరికింది.. అండ్ల ఎన్ని పైసలు ఉన్నయో చూసి తీసుకుందామనుకుంటే.. ఆ బ్యాంకే ఎత్తేసిండ్రట. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందన్నట్లు.. నా గాశారం బాగలేదని ఇంటి దారి పట్టిన హినోజోసాను అదృష్టం మాత్రం వదిలిపెట్టలేదు.
ఎందుకో ఓసారి డౌట్వచ్చి వాళ్ల అయ్య బ్యాంక్ పాస్‌బుక్‌ను పరీక్షపట్టి చూస్తే.. “స్టేట్గ్యారంటీడ్” అనే రెండు పదాలు కనిపించినయ్.. అంటే బ్యాంక్ఎత్తేస్తే.. అండ్ల ఉన్న పైసలకు జమనాతు ఆ సర్కారుదేనన్నట్టు. ఇంకేమున్నది సర్కారుతో కొట్లాడిండు. ఆ కేసు దేశంలో ఉన్న పెద్ద కోర్టు దాకా పోయింది. హినోజోసా పంట పండింది. అతని న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది. 70 ఏండ్ల కిందట అతని తండ్రి ఇల్లు కట్టుకునేందుకు పైసా పైసా ఒక దగ్గర వేసి లక్ష 40 వేలు కూడవెడితే.. అది ఇప్పుడు పది కోట్ల రూపాయలు అయింది. ఆ మొత్తం డబ్బులు ప్రభుత్వం హినోజోసాకు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నుంచి ఆ డబ్బు తీసుకున్న హినోజోసా ఆనందానికి అవధుల్లేవు. ‘‘ ఈ డబ్బు మా కుటుంబానిది. మా నాన్న కష్టార్జితం”అంటూ ఒక మురుసుడు కాదు.
చూసిన్రా.. ఒక్క బ్యాంక్పాత పాస్‌బుక్ తండ్రి సంపాదించిన సొమ్మును కొడుక్కాడికి తీస్కపోయింది. నోముకున్నోడి బూరెలు.. నోసుకున్నోడు తినుడంటే గిదే కావొచ్చు ఉల్లా. పైలం మీ ఇంట్ల మీతాతలు ముత్తాతలు అల్మార్ల ఏమన్న బ్యాంక్పాస్బుక్కులు పెట్టిండ్రో చూడుర్రు మరి!