రాష్ట్ర వ్యాప్త నుక్కడ్ నాటక అంతర్ పాఠశాల పోటీ నిర్వహణ
పల్లవి మోడల్ స్కూల్, అల్వాల్ లో నుక్కడ్ నాటక్ అంతర్ పాఠశాల పోటీలను గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. భారతదేశంలోని తడి భూములు వాటి ప్రాముఖ్యత గురించిన అంశంపై రాష్ట్ర వ్యాప్త సి.బి.యస్.ఇ 29 పాఠశాలలలో 16 పాఠశాలలు పాల్గొన్నాయి. నుక్కడ్ నాటక్ లో పాల్గొన్న విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఉత్తమ ప్రతిభ కనపరచి పల్లవి మోడల్ స్కూల్, అల్వాల్ ఈ పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకోవడం హర్షనీయం. దీనితో కలిపి 9 సార్లు విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా డా.రాజశ్రీ పి మోర్ (హెడ్ & బి ఓ యస్ హిందీ విభాగం తెలంగాణా మహిళా విశ్వవిద్యాలయం, కోటి, హైదరాబాద్), కాంచన్ దులానీ రిటైర్డ్ (2021) హైదరాబాద్లోని సాధు వాస్వానీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ విచ్చేసి విద్యార్థులు ప్రదర్శించిన అద్భుతమైన ప్రదర్శనలను చూసి తడి భూములు పర్యావరణ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని తెలియజేశారు. ఈ కళ సాంస్కృతిక, సామాజిక స్పృహ, ఆసక్తిని పెంచి, తడి భూముల ప్రాముఖ్యతను విద్యార్థులు అవగాహన చేసుకునేలా చేసింది.పల్లవి మోడల్ స్కూల్ సీనియర్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సునీర్ నాగిగారు విద్యార్థులను గురించి ఉపన్యసించారు. విద్యార్థులలో దాగిఉన్న కళను వెలికి తీసి ప్రోత్సాహించి,శిక్షణను ఇచ్చిన శ్రీమతి రీతుకమల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విద్యాధరి గారు, శ్రీమతి సుజన్ జాన్ గారు, శ్రీమతి శిరిన్ మాధురి గారు, శ్రీమతి రీనా సాజన్ గారు, శ్రీమతి మణిందర్ గారు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు.










Related News
-
పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ -2025
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో ఇంటర్స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ 2025..
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో వర్చువల్ మార్కెట్ యార్డ్ వేడుకలు
-
పల్లవి మోడల్ స్కూల్ లో “Debate Competition”