పల్లవి స్కూల్లో క్రిస్మస్ వేడుకలు..
అల్వాల్‌లోని పల్లవి మోడల్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. క్రిస్మస్ టోపీలు, శాంటాక్లాజ్ క్యాప్లతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకర్షణీయమైన వేషధారణలతో రావడం వల్ల స్కూల్లోనే పండుగ వాతావరణం నెలకొంది.

కరోల్ గానం, క్రిస్మస్ పద్యాలు, శాంతి, సామరస్యం కోసం ప్రత్యేక ప్రార్థనలతో ప్రత్యేక అసెంబ్లీ జరిగింది. విద్యార్థులు ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ సందేశాన్ని చాటే నృత్యాలు, స్కిట్లు, పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి విద్యారావు ప్రసంగిస్తూ, “క్రిస్మస్ పండుగ అనేది ఆనందం, ప్రేమను పంచే సమయం. మన విద్యార్థులు రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా మారడానికి ఈ విలువలను వారిలో పెంపొందించడం మన బాధ్యత అని మేము నమ్ముతున్నాము. మా విద్యార్థులు ఏడాది పొడవునా కృషి, అంకితభావంతో విద్యలో రాణిస్తుండటం కూడా మాకు గర్వంగా ఉంటుంద”ని అన్నారు.

Related News
-
పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ -2025
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో ఇంటర్‌స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ 2025..
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో వర్చువల్ మార్కెట్ యార్డ్ వేడుకలు
-
పల్లవి మోడల్ స్కూల్ లో “Debate Competition”