మహేంద్ర హిల్స్ డీపీఎస్ లో ఫస్డ్ డే

పల్లవి, హైదరాబాద్: మహేంద్ర హిల్స్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొత్త అకడమిక్ సెషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్కూల్ యాజమన్యాం విద్యార్థులను సాదర స్వాగతం పలికింది.ఈ మేరకు స్కూలు రీఓపెన్ అయిన మొదటి రోజు ప్రత్యేక డెకరేషన్ చేయడంతోపాటు, రెపరెపలాడే బ్యానర్లు కట్టడంతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రిన్సిపల్ నందితా సుంకర, వైస్ ప్రిన్సిపల్ కిరణ్మయి విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థులంతా ఈ అకడమిక్ ఇయర్ లో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని వాటి కోసం శ్రమించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల పునఃప్రారంభాన్ని ఉత్సాహంగా నిర్వహించినందుకు ప్రిన్సిపల్, టీచర్స్ బృందాన్ని డీపీఎస్ యాజమాన్యం అభినందించింది.


