నీట్ లో పల్లవి స్టూడెంట్ హవా
పల్లవి, హైదరాబాద్: పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్ క్యాంపస్ స్టూడెంట్ నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన వంద ర్యాంకుల్లో 77వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. పల్లవి మోడల్ స్కూలులో చదువుకున్న అనురన్ ఘోష్ 716 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 77వ ర్యాంకు సాధించారు. ఈ మేరకు అత్యుత్తమ ప్రతిభ కనబిరిచిన ఘోష్ ను పల్లవి స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.




