టీచర్ల సమస్య పరిష్కరించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
టీచర్ల సమస్య పరిష్కరించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

పల్లవి, వెబ్ డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్కావెంజర్ బకాయి అమౌంట్, సీపేక్ సర్వే రెమ్యూనరేషన్ రెండు పని దినాల్లోపు సంబంధిత ఖాతాలో జమవుతాయని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు. విద్యా సంవత్ససరం ముగిసినప్పటికీ స్కావెంజర్ అమౌంట్ రాకపోవడంపై ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన.. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో మాట్లాడారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కు అప్రూవల్ పంపామని తెలిపారు. ఆ వెంటనే డీఈవో, ప్రాజెక్టు డైరెక్టర్ శేషాద్రితో మాట్లాడి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. రెండు పని దినాల్లోపు సంబంధిత పాఠశాలల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అకౌంట్లో నిధులు జమ చేస్తామని తెలిపారు.
సీపేక్ సర్వే..
గత సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీపీక్ సర్వేను విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇంతవరకు రెమ్యూనరేషన్ రాలేదు. ఈ విషయాన్ని టీచర్లు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ సెక్రటేరియట్ లో సంబంధిత ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో మాట్లాడారు. వీలైనంత త్వరగా అన్ని జిల్లాల్లోని ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్ లకు రెమ్యూనరేషన్ చెల్లిస్తామని సుల్తానియా హామీ ఇచ్చారు. ఇలా సమస్యను దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వేగంగా స్పందించడమే కాకుండా, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్సీ మల్క కొమురయ్యకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.