హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సత్య కృష్ణన్ కూతురు
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ టాలీవుడ్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. . ఆనంద్, బొమ్మరిల్లు, సామాన్యుడు, రెడీ, దూకుడు, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, ఆడవాళ్లు మీకు జోహర్లు వంటి హిట్ చిత్రాల్లో నటించింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ టాలీవుడ్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. . ఆనంద్, బొమ్మరిల్లు, సామాన్యుడు, రెడీ, దూకుడు, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, ఆడవాళ్లు మీకు జోహర్లు వంటి హిట్ చిత్రాల్లో నటించింది. నటనతోనే కాకుండా తన వాయిస్‌తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు సత్య కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా తెరకెక్కుతున్న కేసీఆర్(కేశవచంద్ర రమావత్) చిత్రంలో అనన్య లీడ్ రోల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే తెలుగులో గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఊ అంటావా మావ ఊహు అంటావా మావ అనే సినిమాలో కనిపించింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా అనన్య కృష్ణన్ కు ఎలాంటి పేరును తీసుకువస్తుందో చూడాలి.