Re-Release Movies In August: ఆగస్టులో రీ-రిలీజ్ సినిమాల హవా.. లిస్టులో బ్లాక్ బస్టర్ మూవీస్

దేశవ్యాప్తంగా ఈ మధ్య రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. గతంలో విజయం సాధించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఆడియన్స్ కు వినోదాన్ని అందిస్తున్నారు మేకర్స్. తెలుగులో కూడా ఇప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను అలరించాయి. అదే విదంగా రానున్న ఆగస్టులో కూడా వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’ సినిమా విడుదల కానుంది. అంతేకాదు.. ఒక్కరోజు ముందుగానే స్పెషల్ షోస్ కూడా వేయబోతున్నారు. ఇక ఆగస్టు 9న మహేష్ బాబు నటించిన మరో క్లాసిక్ మూవీ ‘మురారి’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలకు ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. టికెట్స్ బుకింగ్స్ కోసం ఆడియన్స్ ఎగబడుతున్నారు.
ఇక ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన హీరోగా వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి ఇంద్ర సినిమా రీ రిలీజ్ కోసం మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. ఇంద్ర మూవీ మేకర్స్ కి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. దానిపై స్పందించిన మేకర్స్ మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆగస్టు 29న టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజున ఆయన హీరోగా వచ్చిన పాత్ బ్రేకింగ్ మూవీ శివ సినిమాను విడుదల చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ లో వచ్చిన ఈ సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమాను రీ రిలీజ్ చేస్తుండటంతో నాగార్జున అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. మరి ఈ సినిమాలో ఏ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందో చూడాలి.