కేసీఆర్ మళ్లీ సీఎం కాడు..రేవంత్ తోనే నా ప్రయాణం : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని... సీఎం రేవంత్ రెడ్డితోనే తన ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని… సీఎం రేవంత్ రెడ్డితోనే తన ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్దమని కాకపోతే ఆయనే స్వాగతించడం లేదన్నారు. గంగిరెడ్డి హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనను అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారని తెలిపారు. తనది అందరితో కలిసి పనిచేసే తత్వమని.. జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి భేషాజాలు లేవన్నారు.
మరోవైపు పార్టీ ఫిరాయింపులను తాను జీర్ణించుకోలేకపోతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే వారిపై అనర్హత వేటు పడాలని గతంలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంథీ అన్నారని గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిరాయింపుల వల్ల అసలైన క్షేత్రస్థాయిలోకార్యకర్తలకు ఇబ్బందులకు గురువుతున్నారని చెప్పుకొచ్చారు.
పదేళ్ల పాటు బీఆర్ఎస్ నాయకులు అరాచాకాలను అడ్డుకున్నానని చెప్పిన జీవన్ రెడ్డి.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులే పార్టీలో చేరి కాంగ్రెస్ కార్యకర్తలపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్ఎస్పై పోరాడానన్న జీవన్ రెడ్డి.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే.. తన అనుచరుడిని కిరాతకంగా చంపేశాడన్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని.. మానసిక ఆవేదనలో ఉన్నానని చెప్పుకొచ్చారు.