ఎంపీ కంగ‌నా రనౌత్‌కు బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది.

 పార్టీ పాల‌సీ విష‌యాల‌పై మాట్లాడే అధికారం, అనుమ‌తి ఆమెకు లేద‌ని స్పష్టం చేసింది.

రైతుల ఉద్యమానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.

రైతుల ఉద్యమంలో విదేశాల కుట్ర ఉందని, వారిని అదుపు చేయకపోతే బంగ్లాదేశ్ త‌ర‌హా ప‌రిస్థితుల‌ు వస్తాయని కంగన వ్యాఖ్యానించడం దుమారం రేపింది.

ఆమె ప్రకటనపై విపక్షాలు బీజేపీని లక్ష్యంగా చేసుకున్నాయి. కంగ‌నాపై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.