సమాజాన్ని మార్చే శక్తి మీడియాది – ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉంది… నెగిటివ్ వార్తలతోనే కాదు పాజిటివ్ వార్తలతో కూడా సమాజాంలో మార్పు తెవొచ్చు అని చేవెళ్ల లోక్ సభ బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ హర్షీ చౌదరి పీఐబి డిప్యూటీ డైరెక్టర్ మానస క్రిష్ణ కాంత్, పీఐబి ఏడీజీ శృతి పాటిల్ లతో కలిసి ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ’ రాజకీయాలను రాజకీయ నాయకులే మాట్లాడాలి… మీడియా ప్రతి నిధులు తమ వ్యక్తిత్వాన్ని కాకుండా ప్రజల అభిప్రాయాలను ప్రతిభించాలి.దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది… మన దేశం దరిద్రం మైన దేశం కాదు.భారత ప్రభుత్వం ఈ దేశాభివృద్ధితో పాటు తెలంగాణను అభివృద్ధి చెస్తుంది.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా కృషి చేయాలి’ అని అన్నారు.



